Hanumakond Court: మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌కూ బాంబు బెదిరింపులతో మెయిల్ కలకలం.. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోక ముందే హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఏకంగా అక్కడి ఓ న్యాయమూర్తికి ఆగంతకుడు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టామని చెప్పాడు. ఈ మేరకు న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు బాంబు స్క్వాడ్ బృందం కోర్టుకు చేరుకొని విస్తృత తనిఖీలు చేపడుతున్నది. కోర్టు ఆవరణమంతా శునకాలు, ఇతర పరికరాలతో బాంబులు ఉననాయోమనని జల్లెడ పడుతున్నారు.
