Hanmanth Shinde: ఎమ్మెల్యే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ కీలక నేతలు ఒకరికొకరుగా స్పందిస్తున్నారు. తొలుత ఆ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే స్పందించారు. క్రమ శిక్షణా చర్యల కింద కవితను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, టీ రవీందర్‌రావు పేరిట లేఖను విడుదల చేశారు.
Hanmanth Shinde: ఆ తర్వాత జుక్కల మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే స్పందించారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురుపైనా కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయం అని కొనియాడారు.
Hanmanth Shinde: గతంలోనే కల్వకుంట్ల కవిత పరోక్షంగా బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, జగదీశ్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేయగా, తాజాగా హరీశ్‌రావు, సంతోష్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలతో పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నది. ఆమె వైఖరి శృతిమించుతుందని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కవిత తొలగింపునకే నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.