Hyderabad Expansion: గ్రేటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయానికి మార్గం సుగమమైంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలోని మొత్తం 27 స్థానిక సంస్థలను (20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ డ్రాఫ్ట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు.
విలీనం దిశగా కీలక అడుగు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించాలని రాష్ట్ర మంత్రివర్గం (కేబినెట్) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మేరకు, జీహెచ్ఎంసీ, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్‌లలో సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ డ్రాఫ్ట్‌ను కేబినెట్ గవర్నర్‌కు పంపింది. సోమవారం (డిసెంబర్ 01) ఈ సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఈ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌ను జారీ చేయనుంది.
ఇది కూడా చదవండి: Jaya Bachchan: “వివాహంపై నా సలహా అక్కర్లేదు”: నేటి తరం ఆలోచనలపై జయా బచ్చన్ వ్యాఖ్యలు
27 ప్రాంతాలు ఇక గ్రేటర్లో భాగం
ఈ విలీనం ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల, అలాగే దానికి ఆనుకుని ఉన్న పలు ముఖ్య ప్రాంతాలు ఇకపై జీహెచ్ఎంసీలో భాగం కానున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. ఈ పరిధి విస్తరణతో మెరుగైన పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
విలీనం కాబోయే కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితా:
-
పెద్ద అంబర్ పేట
-
జల్ పల్లి
-
శంషాబాద్
-
తుర్కయాంజిల్
-
మణికొండ
-
నార్సింగ్
-
ఆదిభట్ల
-
తుక్కుగూడ
-
మేడ్చల్
-
దమ్మాయిగూడ
-
నాగారం
-
పోచారం
-
ఘట్కకేసర్
-
గుండ్ల పోచంపల్లి
-
తూముకుంట
-
కొంపల్లి
-
దుండిగల్
-
బొల్లారం
-
తెల్లాపూర్
-
అమీన్ పూర్
-
బడంగపేట్
-
బండ్లగూడ జాగీర్
-
మీర్ పేట
-
బోడుప్పల్
-
పీర్జాదీగూడ
-
జవహర్ నగర్
-
నిజాంపేట
ఈ విలీనం ద్వారా నూతనంగా గ్రేటర్లో చేరబోతున్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. కొత్తగా ఏర్పడే జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.
