Ap news: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను తిరిగి పరిశీలించి, సర్కార్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు ఈ వ్యవహారం ఎలా పట్టింది అంటే, ఇటీవల వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ ఆస్తుల వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు జగన్‌కు చెందిన మాచవరంలోని సరస్వతి పవర్ అసైన్డ్ భూములపై విచారణ జరిపించారు. అధికారుల నుండి ఈ భూములపై ఆరా తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు.
మాచవరం ఎంఆర్ఓ క్షమారాణి, వీఆర్ఓ అఖిల్, ఆర్ఐ కోటేశ్వరరావు, సర్వేయర్ సాల్మన్ రాజు, ఇతర అధికారులు కలిసి ఆ భూములపై పరిశీలించి, నివేదిక అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా, ప్రభుత్వం 17.69 ఎకరాల భూములను తిరిగి పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకుంది.

