Jasprit Bumrah: భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన వెన్ను గాయం నుంచి కోలుకుంటూ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న భారత జట్టుకు ఒక సానుకూల వార్తగా నిలిచింది. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, భారత జట్టు మరింత బలోపేతం కానుంది. బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బౌలింగ్ వీడియోను పోస్ట్ చేశాడు, దీనికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్‌లో ఆడుతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అద్భుతంగా రాణిస్తూ రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసింది. భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేయడం భారత అభిమానులకు శుభ సంకేతంగా మారింది.
జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేకపోయాడు. అతని స్థానంలో హర్షిత్ రాణాను జట్టులో చేర్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సిడ్నీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. సిరీస్ ముగిసిన తర్వాత నుంచి అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ గాయం వల్ల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అతను పాల్గొనలేకపోయాడు.
ఇప్పుడు బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన ఫిట్‌నెస్‌ను పునరుద్ధరించుకోవడానికి కఠోర సాధన చేస్తున్నాడు.
View this post on Instagram
ఈ సందర్భంగా అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్‌గా మారింది. గురువారం నాడు, బుమ్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అతను స్టంప్స్‌ను కొడుతూ కనిపించాడు. బుమ్రా మళ్లీ బౌలింగ్ చేస్తుండటం చూసి అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నాడు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. “జస్సీ భాయ్ ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు” అని ఒక అభిమాని కామెంట్ చేశాడు కానీ బుమ్రా ఈ టోర్నమెంట్ లో పాల్గొనే అవకాశం లేదు.
భారత జట్టు మార్చి 2న న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్ ఆడనుంది. టీం ఇండియా ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నప్పటికీ, ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక సెమీఫైనల్స్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో ఏ ఒక్కరితో ఢీకొంటుందో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.

