Gold rate: ఈ మధ్య కాలంలో బంగారపు ధరలు క్రమంగా తగ్గుతూ రావడం గమనిస్తూనే ఉన్నాం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవడం ధరల తగ్గుదల పై భారీ ప్రభావం చూపించింది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన క్రమంలో బంగారం ధరల్లో కీలక మార్పులు జరిగాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటందని, డాలర్ విలువ పెరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
దీంతో అక్కడి బాండ్ ఈల్డ్స్, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తగ్గుతుందనుకున్న బంగారం ధర మళ్ళీ పుంజుకుంటుంది.పండుగ సీజన్ సమీపించడంతో, ఈ ధరలు ఆభరణాలు కొనుగోలుకు అనుకూలంగా మారాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79 వేల 650 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 78వేల 210 వద్ద ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79 వేల 650 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78 వేలు పలుకుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69 వేల 350 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 77 వేల 990గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78 వేల 180గా ఉంది.