Gold Rate Hike:

Gold Rate Hike: 2026 జూన్‌లో బంగారం ధ‌ర ఎంతో? తెలుసుకోవాల‌ని ఉందా?

Gold Rate Hike: బంగారం ధ‌ర ఆకాశ‌న్నంటుతున్న‌ది. సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు అంద‌నంటున్న‌ది. ఇప్పుడు ల‌క్ష‌న్న‌ర‌కు స‌మీపంలో ఉన్న తులం (10 గ్రాములు) బంగారం ధ‌ర‌.. వ‌చ్చే జూన్ నాటికి ఎంత ఉంటుందో ఊహించుకుంటేనే గుండె గుబిల్లుమంటున్న‌ది. వివాహ‌, ఇత‌ర శుభ‌కార్యాల‌కు కొనాలంటే ఆయా వ‌ర్గాలు బెంబేలెత్తుతున్నాయి. బంగారం ఇక కొన‌లేమా? అన్నంతగా ధ‌ర‌లు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

Gold Rate Hike: ముఖ్యంగా 2025లో బంగారం ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతూ వ‌స్తున్నాయి. మునుపెన్న‌డూ లేనంత‌గా ఆకాశ‌మే హ‌ద్దుగా ధ‌ర‌లు దూసుకుపోయాయి. 2026లోనూ అదే ట్రెండ్ కొన‌సాగుతున్న‌ట్టు అంచ‌నాలు అందుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా తాజాగా 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.1.41 లక్ష‌ల స్థాయిలో క‌దులుతున్న‌ది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో అతి విలువైన లోహాల ధ‌ర‌లు భారీగా పుంజుకోవ‌డంతో దేశీయంగా ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.

Gold Rate Hike: అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర ప్ర‌స్తుతం రూ.4,500 డాల‌ర్ల స్థాయిలో ఉండ‌గా, ఈ ఏడాది మార్చి నాటికి 5,000 డాల‌ర్ల‌కు తాకే అవ‌కాశం ఉన్న‌ద‌ని హెచ్ఎస్‌బీసీ క‌మోడిటీ అంచ‌నా వేస్తున్న‌ది. అదే ఈ ఏడాది జూన్ నాటికి దేశీయంగానే తులం (10 గ్రాములు) బంగారం ధ‌ర రూ.2 ల‌క్ష‌లు తాకే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని వ్యాపార వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Gold Rate Hike: ప్ర‌స్తుతం బంగారం ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నా ఈ 2026 ఏడాది చివ‌రిలో తిరోగ‌మ‌న బాట‌ప‌ట్టే అవ‌కాశాలు కూడా లేక‌పోలేద‌ని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా, ప్ర‌స్తుతం రికార్డు స్థాయిలో ధ‌ర‌లు పెర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా విక్ర‌య దుకాణాలు వెల‌వెల‌బోతున్నాయి. దీంతో రానురాను బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయ‌న్న అంచ‌నాతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *