Gold rate: ఇటీవల అంతర్జాతీయ భౌగోళిక పరిణామాల ప్రభావంతో వేగంగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా అమెరికా మరియు చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గడంతో గోల్డ్ రేట్లు తగ్గాయి. దీని వల్ల బంగారం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 99,950గా నమోదవగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకి అది ఏకంగా రూ. 3,400 తగ్గి రూ. 96,125కి చేరుకుంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 96,550గా నమోదైంది.
అంతర్జాతీయంగా కూడా ఔన్సు బంగారం ధర 3,400 డాలర్ల పై స్థాయిల నుంచి 3,218 డాలర్లకు పడిపోయింది. వెండి ధరలో కూడా స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ. 99,700 వద్ద కొనసాగుతోంది.
