Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద వెంకీ, ఐశ్వర్య!

Sankranthiki Vasthunam: ‘దిల్’ రాజు ప్రొడక్షన్ హౌస్ లో ఇప్పటికే హ్యాట్రిక్ సాధించారు విక్టరీ వెంకటేశ్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్-2, ఎఫ్-3’ తో హ్యాట్రిక్ సాధించిన ఈ కాంబో… ఇప్పుడు నాలుగో సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేస్తోంది. అయితే ముందు మూడు సినిమాలు మల్టీస్టారర్స్ కాగా ఇప్పుడు వెంకటేశ్ సోలో హీరోగా ఈ మూవీ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాబోతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు మీద’ అనే పాట విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రమణగోగుల, మధుప్రియ దీనిని పాడారు. షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ సినిమాను ట్రైయాంగిల్ క్రైమ్ స్టోరీగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తుండగా, గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *