Ghaati: అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఘాటీ’ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు మూడు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ప్రమోషన్స్ షురూ కాలేదు. ఇతర చిత్రాల నుంచి వస్తున్న వరుస అప్‌డేట్స్ మధ్య ‘ఘాటీ’ టీమ్ సైలెంట్‌గా ఉంది.
Also Read: Coolie: రజినీ ‘కూలీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై సరికొత్త అప్‌డేట్!
Ghaati: తాజా సమాచారం మేరకు, జూన్ 21 నుంచి ప్రమోషన్స్ జోరందుకోనున్నాయి. ఆ రోజు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్‌తో ప్రచారం మొదలవనుంది. రిలీజ్‌కు రెండు వారాల ముందు ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసి, అనంతరం గట్టిగా ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనుష్క ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఘాటీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

