Gang War

Gang War: ఉద్రిక్తత…రెండు వర్గాల మధ్య ఘర్షణ.

Gang War: ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వత్సవాయి మండలం తాళ్లూరుకు చెందిన యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది. ఇదే క్రమంలో యువతి కనిపించలేదు. యువతీ కనిపించకపోవడంతో, ప్రేమ వ్యవహారమే కారణమని యువకుడి ఇంటి దెగ్గర ఘర్షణకు దిగారు ఇందుకు యువకుడి కుటుంబ సభ్యులే కారణమంటూ యువతి కుటుంబ సభ్యులు అలానే బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు మాట మాట పెరిగి యువతి కుటుంబ సభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు.

ఇది కూడా చదవండి: America: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన కేటుగాడు..

Gang War: ఈ దాడుల్లో 6 కార్ల అద్దాలు ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాల వారు తాళ్లూరు పీఎస్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు,ఈ క్రమంలో  పీఎస్‌ ఆవరణలో మరో సారి వాగ్వాదానికి దిగగా పోలీసులు కలగచేసుకొని ఇరు వర్గాలను అదుపుచేశారు అనంతరం రెండు వర్గాలతో పోలీసులు మాట్లాడారు. గ్రామంలో చెలరేగిన ఉద్రిక్తతలను సద్దుమనిగించారు. రెండు కుటుంబాలు మరోసారి కూడా పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. ఎలాంటి దాడులకు దిగినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *