Game Changer: మెగా అభిమానులకు వీకెండ్ లో అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ ను లక్నోలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. రిలీజ్ లోనే టాలీవుడ్ విధానాల్లో గేమ్ ఛేంజర్ గా నిలిచేలా టీజర్ ను లక్నోలో లాంచ్ చేయడం . . దానికి మెగాభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను వెల్లడిస్తోంది . ఇక టీజర్ విడుదలైన తరువాత మెగా అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది . గత కొంతకాలంగా శంకర్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు . అందులోనూ తాజాగా వచ్చిన కమల్ . . భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో గేమ్ ఛేంజర్ విషయంలో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా అనుమానాలు రేకెత్తాయి . అయితే , గేమ్ చెంజర్ టీజర్ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూనే సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది .
Game Changer: చాలా షేడ్స్ లో రామ్ చరణ్ ఈ టీజర్ లో కనిపించారు . ప్రతి షెడ్ లోనూ సెకన్లలోనే తనదైన మార్క్ ను చూపించారు . టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ సంక్రాంతికి బక్సాఫీస్ దుమ్ముదులిపే సినిమా గేమ్ ఛేంజర్ అవుతుందనే అంచనాకు వచ్చేశారు . ఐ యామ్ అన్ ప్రిడిక్టబుల్ అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ డైనమైట్ లా పేలింది . సినిమాలో ఉన్న ముఖ్యమైన తారాగణాన్ని మొత్తం టీజర్లో చూపించారు . టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో వినిపించింది . పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అయినా కూడా ఎదో సమ్ థింగ్ స్పెషల్ అనేలా టీజర్ కనిపించింది. శంకర్ మార్క్ భారీతనం . . రామ్ చరణ్ మాసివ్ లుక్స్ . . సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి టీజర్ లో.
Game Changer: మరి గేమ్ ఛేంజర్ టీజర్ మీరు చూశారా ? ఇంకా చూడలేదా ? ఆలస్యం ఎందుకు . . కింద ఉన్న వీడియోలో టీజర్ చూసేయండి . మీరే అంటారు టీజర్ అదుర్స్ అని !
చూశారుగా . . మీరేమంటారు ? అన్నట్టు ఈ టీజర్ థియేటర్ లో చూసి బయటకు వచ్చిన వారు ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూస్తే మతిపోతుంది . ఇదిగో ఇక్కడ ఆ వీడియో కూడా ఉంది.. ఓ లుక్కేసేయండి !

