Game Changer Song: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నుండి థర్డ్ సింగిల్ విడుదలైంది. ఇంతవరకూ విడుదలైన రెండు సినిమాలు మాస్ ఆడియెన్స్ ను మెప్పించే విధంగా ఉండగా… తాజా గీతం మెలోడీతో సాగి వీనుల విందును కలిగచేస్తోంది. ‘నానా హైరానా’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, తమన్ స్వరాలు సమకూర్చారు. కార్తీక్ తో కలిసి శ్రియా ఘోషల్ దీనిని పాడారు. శంకర్ దర్శకత్వంలో రాజు, శిరీష్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2015 జనవరి 10న విడుదల కాబోతోంది. ఇందులో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారిగా, ప్రజానేతగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపిస్తాడని టాక్.
