Reshma Rathod: బుల్లితెర నుంచి వెండితెర వరకూ ప్రయాణం చేసిన రేష్మ రాథోడ్, ప్రస్తుతం జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జన్మించిన ఆమె, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసింది. తన కెరీర్‌ను బుల్లితెరపై చిన్నపాత్రలతో ప్రారంభించిన రేష్మ, 2012లో వెంకటేశ్, త్రిష నటించిన బాడీగార్డ్ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించి వెండితెరకు పరిచయమైంది. అదే ఏడాది మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో కథానాయికగా మారింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ఆమె యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తొలి సినిమాతో హిట్ కొట్టినప్పటికీ, రేష్మ నటించిన తర్వాతి సినిమాలు జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం అంతగా విజయం సాధించలేదు. తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా నటించినా, ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. ఫలితంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో, ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పింది.
Also Read: Rashmika Mandanna: రష్మికపై గుర్రుగా ఉన్న కర్ణాటక!
Reshma Rathod: 2017 తర్వాత పూర్తిగా సినీరంగానికి దూరమైన రేష్మ, రాజకీయాల్లో అడుగుపెట్టింది. బీజేపీలో చురుగ్గా వ్యవహరించిన ఆమె, ఇదే సమయంలో లాయర్ విద్యను కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లాయర్‌గా విధులు నిర్వహిస్తూ, తన కొత్త లక్ష్యాలను అనుసరిస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే రేష్మ, సినిమాల నుంచి కోర్టు హాల్స్ వరకూ చేసిన మార్పుతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

