Bollywood: బాలీవుడ్‌లో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చాలా మంది నటీమణులు పెళ్లికి ముందే గర్భవతి అయి అభిమానులను షాక్‌కు గురిచేశారు. అలాంటి కొంతమంది నటీమణులు ఎవరో తెలుసుకుందాం.
ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ ఏప్రిల్ 2022లో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే ఆలియా గర్భవతి అనే వార్త అభిమానులను ఆశ్చర్యపరిచింది. అలియా భట్ నవంబర్ 2022లో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. అలియా భట్ కూతురు పేరు రాహా కపూర్.
మే 2018లో నటుడు అంగద్ బేడిని వివాహం చేసుకున్న నేహా ధూపియా, వారి మొదటి బిడ్డతో మూడు నెలల గర్భవతి. నేహా ధూపియా 2018 నవంబర్‌లో తన కుమార్తె మెహర్‌కు జన్మనిచ్చింది.
ఇది కూడా చదవండి: Dragon OTT: ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న “డ్రాగన్”!
ఫిబ్రవరి 2021లో వైభవ్ రేఖిని వివాహం చేసుకున్న నటి దియా మీర్జా, అదే సంవత్సరం జూలైలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వారి కొడుకు పేరు అవ్యాన్ ఆజాద్ రేఖి.
నటి ఇలియానా 2023 ఏప్రిల్‌లో తండ్రి ఎవరో వెల్లడించకుండా తాను గర్భవతినని ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేసింది. తరువాత ఆమె మైఖేల్ డోలన్‌తో తన సంబంధాన్ని ధృవీకరించింది. ఆగస్టు 2023లో వారి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్‌ను స్వాగతించింది.
మోడల్, నటి నటాషా స్టాంకోవిచ్ 2020 ప్రారంభంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమె జూలై 2020లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడి పేరు అగస్త్య పాండ్య.