Free Gas Cylinder Scheme: ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభం. దీపావళి రోజున ఈ పథకాన్ని ”దీపం” పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం లబ్దిదారులు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో బుక్ చేసుకోవొచ్చు. దీపం పథకం కింద ముందుగానే పూర్తి ధరను చెలించాలిసి ఉంటుంది తర్వాత 48 గంటలో తిరిగి లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారు.
Free Gas Cylinder Scheme: ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న కూటమి ప్రభుత్వం చెప్పారు. ఈరోజు 29 అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు మొదటి ఉచిత సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పంపిణికి కోసం నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖతో కలిసి లబ్దిదారుల ప్రత్యేక ఖాతాలో ఈ నిధులను జమ చేయనున్నారు.
ఈ పథకానికి అర్హులెవరంటే ?
గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే నిరుపేద కుటుంబాలకు మాత్రమే అమలవుతుందా లేక ధనికులకు కూడా ఈ పథకం వర్తిస్తుందా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదు.