Flight Accident: గుజరాత్ రాష్ట్రంలో ఎయిరిండియా విమానం కుప్పకూలి పడిపోయింది. గుజరాత్ మేఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయం సమీపంలోని జనావాసాల్లో ఆ విమనాం కూలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దట్టమైన పొగ వెలువడుతున్నది. ఆ విమానంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కుప్పకూలిన ఎయిరిండియా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ సమయంలో కూలిపోయిందంటున్న వైమానిక శాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి 12 ఫైరింజన్లు చేరుకున్నాయి. ఈ ఘటనతో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీగా పొగ కమ్ముకుంటున్నది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.