2024 FIDE: గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేశి, ప్రజ్ఞానందతో పాటు అయిదుగురు భారత క్రీడాకారులు ఫిడే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్నారు. న్యూయార్క్ లో ఈ నెల 26 నుంచి 31 వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జరగనుంది.అయిదుసార్లు ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో పాటు నకముర, కరువానా వంటి మేటి గ్రాండ్‌మాస్టర్లు ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. 26న ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌తో టోర్నీ మొదలవనుంది. హంపి, హారిక, వైశాలి మహిళల ఈవెంట్లో పోటీపడనున్నారు.

