Bheemavaram Balma

Bheemavaram Balma: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న భీమవరం బల్మా పాట!

Bheemavaram Balma: స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‘భీమవరం బల్మా’ పాటను విడుదల చేశారు. ఈ పాటలో తొలిసారి ప్లేబ్యాక్ సింగర్‌గా నవీన్ తన గొంతు వినిపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాని తెగ ఊపేస్తుంది. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా’ అనే ఫస్ట్ సింగిల్ పాటను   విడుదల చేశారు.

Also Read: Chikiri Chikiri Song: చికిరి సాంగ్ మేకింగ్ వీడియో వైరల్!

ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాటలో నవీన్ తొలిసారి ప్లేబ్యాక్ సింగర్‌గా మారి, తన గొంతుతో ప్రేక్షకులను ఆకర్షించాడు. నవీన్ సరసన మీనాక్షి చౌదరి మాస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంది. క్యాచీ ట్యూన్‌తో ఈ పాట మంచి వైబ్స్ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని విస్తృతంగా విడుదల చేయనున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు మళ్ళీ పెరిగాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *