Fire Accident: హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో పెను విషాదం చోటుచేసుకున్నది. బాలానగర్‌లోని ఓ ఇంటిలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, ఆత్మహత్య ఘటన అని తెలుస్తున్నది. అగ్నిప్రమాదం జరిగి సాయి సత్య శ్రీనివాస్ చనిపోలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అనుమానాలు బలపడుతున్నాయి. తొలుత అగ్నిప్రమాదంగా భావించారు. ఈ ప్రమాదంలోనే సాయి సత్య శ్రీనివాస్ సజీవ దహనం అయ్యాడని అనుకున్నారు.
Fire Accident: సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను ఆర్పివేశారు. శ్రీనివాస్ ఇంటి ఇరుగు పొరుగుతో, పనిచేసే కెమికల్ పరిశ్రమ తోటి ఉద్యోగులు, యాజమాన్యంతో పోలీసులు విచారణ జరిపారు. శ్రీనివాస్ అగ్నిప్రమాదంలో చనిపోయాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
Fire Accident: మృతుడు శ్రీనివాస్ ఓ కెమికల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని, గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కారణంగానే తన ఇంటిలోనే కెమికల్ బ్లాస్ట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తున్నది. ఈ ప్రమాద విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు వ్యాపించకుండా ఆర్పివేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.