Fire Accident: తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లడ్డు కౌంటర్లోని ఒక దానిలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కౌంటర్ నెంబర్ 47లో లడ్డూలను ఇస్తున్నారు. ఈ సమయంలో కంప్యూటర్ సీపీయూలో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు వచ్చాయి . ఒక్కసారిగా కౌంటర్ లో మంటలు రావడంతో క్యూలైన లో లడ్డూల కోసం వేచివున్న భక్తులు ఉలిక్కి పడ్డారు. ఆందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు పెద్దవి కాకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా, ఇతర కౌంటర్లకు పాకకుండా ఆపగలిగారు.

