IOC: వడోదరలోని కోయిలీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
IOC: ప్లాంట్‌లోని పేలుడు శబ్ధంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక, పోలీసు బృందాలతో పాటు రెండు అంబులెన్స్‌లు కూడా కంపెనీ దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి.
IOC: రెండు గంటలకు పైగా సిబ్బంది శ్రమించినా మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు. మరోవైపు, కంపెనీలో అంబులెన్స్‌లను కూడా మోహరించారు. అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులతో సహా పోలీసులను కూడా మోహరించారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు, ప్రాణనష్టం ఏమయినా జరిగిందా అనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

