Farmers' Rebellion:

Farmers’ Rebellion: 10 గ్రామాల రైతుల తిరుగుబాటు.. గ‌ద్వాల జిల్లాలో అల‌జ‌డి

Farmers’ Rebellion:ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ ప‌నులు నిలిపివేస్తామ‌ని ప్ర‌భుత్వం గ‌తంలోనే ప్ర‌క‌టించింది.. ఆనాడు అంతా ఊపిరి పీల్చుకున్నారు.. పీడ విర‌గడైంద‌ని పండుగ చేసుకున్నారు.. త‌మ పొలాల్లో హాయిగా ప‌నులు చేసుకుంటూ పిల్లాపాప‌ల‌తో జీవిస్తున్నారు.. ఉన్న‌ట్టుండి పిడుగుపాటు లాంటి వార్త దావాన‌లంలా వ్యాపించింది.

Farmers' Rebellion:

Farmers’ Rebellion:ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ ప‌నులు చేప‌ట్టేందుకు యాజ‌మాన్యం సిద్ధ‌మై ప‌లు వాహ‌నాల‌తో త‌ర‌లివ‌చ్చిందని తెలియ‌డంతో ఊరూరూ ఒక్క‌టైంది.. 10 గ్రామాల ప్ర‌జ‌లు వెల్లువ‌లా క‌దిలి త‌రంగాల్లా త‌ర‌లివ‌చ్చారు.. ఇథ‌నాల్ ఫ్యాక్టరీ యాజ‌మాన్యం తెచ్చిన వాహ‌నాలు, అక్క‌డ ఏర్పాటు చేసిన షెల్ట‌ర్‌ను ధ్వంసం చేశారు. అక్క‌డ వేసిన షెల్ట‌ర్‌, టెంట్‌కు నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న తాజాగా జోగులాంబ గ‌ద్వాల జిల్లా రాజోలి మండ‌లం పెద్ద ధ‌న్వాడ గ్రామంలో చోటుచేసుకున్న‌ది.

Farmers’ Rebellion:ప‌నులు నిలిపివేస్తామ‌ని గ‌తంలో ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌డంతో తాము ఆందోళ‌న విర‌మించామ‌ని ఆ 10 గ్రామాల రైతులు తెలిపారు. మ‌ళ్లీ ప‌నులు చేసేందుకు కంపెనీ యాజ‌మాన్యం సిబ్బంది, వాహ‌నాల‌తో రావ‌డంతో క‌డుపు మండుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా భూములు లాక్కుంటారా? అంటూ మండిప‌డ్డారు. ఆందోళ‌న‌కు దిగిన రైతులను పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా ఆగ‌కుండా త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తంచేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold Rate Today: భారీగా తగ్గి సడెన్ షాకిచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *