Family Suicide: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్నే బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణానికి కారణమయ్యాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో జరిగింది. తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. గత ఆరు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతోనే ఆ కుటుంబం సతమతం అయిందని సన్నిహితుల ద్వారా తెలిసింది.
Family Suicide: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ మహేశ్వర్ నగరిలోని సెయింట్ జోసఫ్ స్కూల్ సమీపంలోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదో తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే పిల్లలు ఉన్నారు.
Family Suicide: చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశాడు. గత ఆరు నెలల నుంచి ఎలాంటి ఉద్యోగం లేక సతమతం అవుతున్నాడు. ఎక్కడ ప్రయత్నించినా సరైన ఉద్యోగం లభించలేదు. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో చనిపోవాలని ఆ దంపతులు భావించినట్టు అనుమానిస్తున్నారు.
Family Suicide: చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి దంపతులు ఉండే ఇంటికి సమీపంలో ఉండే బంధువులు సోమవారం రాత్రి వారికి ఫోన్ చేస్తే ఆ దంతపతులు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా, చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి దంపతులు చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరేసుకొని కనిపించారు. మరో గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారు.
Family Suicide: వారింటికి వచ్చిన బంధువులు వెంటనే ఘటన విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు వచ్చి పరిశీలించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పిల్లలైన శ్రీత అబిడ్స్‌లోని ఫిట్టి స్కూల్‌లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో చదివేవారు.
Family Suicide: నలుగురి మృతితో హబ్సిగూడలోని వారింటి సమీపంలో విషాదం నెలకొన్నది. తమ తోటి పిల్లలు చనిపోవడంపైనా ఆ పిల్లలు చదివే ఫిట్టి స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్ తోటి విద్యార్థుల్లో ఆవేదన నిండుకున్నది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేక తనువు చాలించడంపై అందరూ సానుభూతి చూపుతున్నా, బతికి ఉండి పరిష్కారం చూసుకుంటే బాగుండు కదా అని అందరూ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.