Telangana Secretariat

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల వ్యవహారం కలకలం

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన సదరు వ్యక్తులు.. ఉద్యోగుల పేరిట దర్జాగా తిరుగుతూ సెక్షన్ ఆఫీసుల్లో హల్‌చల్ చేశారు. సెక్షన్ ఆఫీసుల్లో పనులు చేపిస్తామంటూ దందాలకు దిగారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో సచివాలయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఎంతో చాకచక్యంగా ఓ నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు.

ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు… రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ క్రమంలో డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవిని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈ విషయం సచివాలయ భద్రతా సిబ్బంది దృష్టికి వచ్చింది. దీంతో ఇంటెలిజన్స్ అధికారులు ఎంతో చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ మీడియా సమావేశంలో ఉద్యోగి పేరిట హల్‌చల్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బట్టబయలైంది. నకిలీ ఐడెంటిటీ కార్డుతో చలామణి అవుతున్న విషయం బయటపడింది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా నకిలీ ఐడెంటిటీకార్డు తీసుకుని సెక్షన్‌లో దర్జాగా తిరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించారు. ఇతనికి సహకరించిన రవి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *