fake court

FAKE COURT: ఐదేళ్లుగా నకిలీ కోర్టు..నకిలీ న్యాయమూర్తి…

FAKE COURT: ఈ మధ్య కాలంలో నకిలీ బ్యాంకుల గురించి ఎక్కువగా వింటున్నారు. అయితే ఇటీవల నకిలీ కోర్టును కూడా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఐదేళ్ల నుంచి ఓ నకిలీ కోర్టు ఉంది. కానీ పోలీసులు ఇటీవల దానిని గుర్తించారు. ఐదేళ్ల నుంచి ఈ కోర్టులో తీర్పులు ఇస్తున్నారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి న్యాయమూర్తిగా వ్యవహరించి తీర్పులు ఇస్తున్నారు.

వరికి ఎలాంటి అనుమానం రాకుండా అచ్చం కోర్టు ఎలా ఉంటుందో.. అలానే మెయింటైన్ చేశారు. ఈ కోర్టు కార్యకలాపాలపై అనుమానం వచ్చి అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు కరంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. న్యాయమూర్తి అయిన శామ్యూల్‌ ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తన క్లయింట్‌కు 2019లో అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చాడు.

FAKE COURT: ఆ తర్వాత భూమి రెవెన్యూ రికార్డుల్లో తన క్లయింట్‌ పేరును చేర్చాలని జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశాడు. దీనిని అమలుచేయాలని కోరుతూ శామ్యూల్‌ మరొక న్యాయవాది ద్వారా సిటీ సివిల్‌కోర్టులో అప్పీల్‌ చేశాడు. తాను జారీ చేసిన నకిలీ ఉత్తర్వులను కూడా ఈ పిటిషనుకు జత చేశాడు. ఆ ఉత్తర్వులు నకిలీవని కోర్టు రిజిస్ట్రారు గుర్తించడంతో శామ్యూల్‌ నకిలీ కోర్టును నడుపుతున్నట్లు బయటపడింది.

ఈ నకిలీ కోర్టును గత ఐదేళ్ల నుంచి నడిపిస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో ఉన్న భూవివాదాల కేసుల ద్వారా విషయం బయటపడింది. క్లయింట్లను పిలిచి.. వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ డబ్బులు దోచుకున్నాడు. గత ఐదేళ్ల నుంచి ఇదే జరుగుతుంది. కానీ పోలీసులు ఇటీవల నకిలీ కోర్టును గుర్తించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *