Perni Nani

Perni Nani: దొరికారు కాబట్టి రూ.కోటి కట్టారు… పేర్ని నానిని కాపాడుతోంది ఎవరు?

Perni Nani: గత వైసీపీ హయాంలో మచిలీపట్నం నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. ఆ నియోజకవర్గానికి 2019- 2024లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పేర్ని నాని రాష్ట్ర రాజకీయాలకు సుపరిచితుడు తన వాగ్దాటితో ప్రత్యర్థులపై విరుచుకు పడడం వైసీపీ అధినేత జగన్ దగ్గర తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఐదేళ్లు వైసీపీ హయాంలో మంత్రి పదవి అనుభవించిన పేర్నినాని ఆస్తులు కూడా పెట్టుకోవడంపై దృష్టి పెట్టారు. అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.

అవినీతి చేయని ప్రభుత్వం తమది… అవినీతి మచ్చలేని నాయకుడు జగన్ అని ఎప్పుడూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరి అదే నియోజకవర్గంలో తన భార్య జయసుధ సొంత గోదాములో రేషన్ బియ్యం మాయం అవ్వడంపై పేర్నినాని నోరు మెదపట్లేదు. వేర్ ఇస్ పేర్నినాని అనే పరిస్థితికి నియోజకవర్గ ప్రజలు వచ్చారు. ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో పేర్నినాని పరారయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ బియ్యం రవాణాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో తాజాగా పేర్నినాని భార్య జయసుధ గోదాములో బియ్యం మాయం ఘటన అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.

Perni Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌ పేర్నినాని అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్నినాని కుటుంబంపైన కేసు నమోదు అయ్యింది. అరెస్టు తప్పదనే వాదన వినిపిస్తుంది. దీంతో అజ్ఞాతంలోకి పేర్నినాని కుటుంబం వెళ్ళింది. ఇదే సమయంలో పేర్నినాని రాజీ ఫార్ములా తెరమీదకు తీసుకొచ్చారు. ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. పేర్నినాని తన సతీమణి పేరుతో పౌరసరఫరాల సంస్థకు అద్దె ఇచ్చిన గోదాములో అందులో నిల్వ ఉంచిన 378 బస్తాల మీద రేషన్ బియ్యం మాయమయ్యాయి. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు.

అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో పేర్నినాని కొత్త ప్రతిపాదన తెరమీదకి తీసుకురావడంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. కాబట్టి కోటి రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తానన్నట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం నిజంగానే అదే వైసీపీ హయాంలో ఉన్నట్టుగా ఉండి ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఎన్ని బస్తాలు ఎక్కడికి మాయమయ్యాయి కూడా తెలిసేది కాదని కూటమి నాయకుల వాదన మరి నిజంగానే పేర్నినాని బియ్యం అక్రమ రవాణా చేయించారా… బియ్యం మాయమయ్యాయి లేదా మాయం చేశారా అనేది బందరు ప్రజల ప్రశ్న… చూడాలి మరి పోలీసులు మరి ఎలాంటి ముందడుగు వేస్తారో…

Perni Nani: గోదాములో బియ్యం మాయమైన అప్పటి నుంచి పేర్నినాని మెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయం కూడా బియ్యం లెక్కల్లో తేడాలు ఉన్నాయని దానికి డబ్బులు చెల్లిస్తానని పౌరసరఫరాల అధికారులకు పేర్నినాని లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేసు నమోదు కావడంతో బెయిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన పేర్నినాని అధికారులకు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇది సన్నిహితుల సమాచారం తప్ప అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాల సైతం పేర్నినాని జాడలేదు. జిల్లా అధ్యక్షుని హోదాలో పేర్నినాని నేతృత్వంలో వహించాల్సిన కార్యక్రమం ఆయన కుమారుడు కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో పేర్నినాని అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడటం ఖాయమని ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనుభవించిందంతా ఒక్కొక్కటిగా కూటమి కక్కిస్తుందని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం చూస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *