Hair Loss: ప్రస్తుత జీవన విధానంతో చాలా మందికి జట్టు రాలిపోతుంది. మహిళలతోపాటు పురుషుల్లో కూడా హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతోంది. పురుషులలో జుట్టు రాలడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అయితే మగవారి జుట్టు ఎందుకు రాలుతుంది, దానికి పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఈస్ట్రోజెనిక్ అలోపేసియా ఇది మగవారిలో కనిపించే DTH హార్మోన్ అసమతుల్యత కారణంగా వస్తుంది. ఇందులో పురుషుల తలలోని ఒక భాగం నుంచి జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. 30 శాతం మంది పురుషులలో.. ఈ సమస్య 30 సంవత్సరాల వయస్సులో మొదలవుతుందని అంచనా. హార్మోన్ల మార్పుల వల్ల కూడా మగవారిలో జట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం టెస్టోస్టెరాన్ అనే సెక్స్ హార్మోన్. అంతేకాకుండా జన్యుమార్పుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది.
ఈ అలవాట్లను మానుకోవాలి
వేడి నీళ్లతో స్నానం: స్నానానికి వేడినీటిని ఉపయోగించడం కంటే చల్లటి నీటితో స్నానం చేయడం చాలా ఉత్తమమని చాలా మంది సౌందర్య నిపుణల అభిప్రాయం. వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అవుతాయి. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లను తలపై పోసుకోవడం వల్ల తల వెంట్రుకులకు సంబంధించిన ఫోలీ సెల్స్ తెరుచుకోవడంతో తలవెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.
Also Read: Tesla: త్వరలో ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ కారు లాంచ్… ధర తెలిస్తే మైండ్ బ్లాకే
గట్టిగా తలదువ్వడం: జుట్టు రాలడంలో గట్టిగ తలదువ్వడం ఒక ప్రధానమైన కారణం. తల దువ్వవే సమయంలో తలమాడుకు ఎక్కువ ప్రెజర్ పెట్టి దువ్వకూడదు. దాని వల్ల వెంట్రుకు చిక్కు పడి రాలిపోయే ప్రమాదం ఉంది. తల దువ్వేటప్పుడు ముందుగా పెద్ద పళ్లు ఉన్న దువ్వెనలతో చిక్కుముడులు వదిలించి, ఆ తర్వాతే వేరే దువ్వెనతో మృధువుగా దువ్వుకోవాలి. లేదంటే చిక్కుముడులతో లాగడం వల్ల వెంట్రుకలు తెగిపోయే ప్రమాదం ఉంది.
తడితల దువ్వడం: మీరు తలస్నానం చేసినప్పుడు కురులు ఆరే వరకు తలదువ్వకూడదు. తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు బలహీనపడుతాయి. టైమ్ లేదనో.. మరేదైనా కారణం చేతనో చాలా మంది చేసే పెద్ద తప్పు తల తడిగా ఉన్పప్పుడే తలదువ్వుతుంటారు. తడి మీద తలదువ్వడంతో వెంట్రుకలు సెట్ చేసినట్లు అవుతుందని నమ్ముతుంటారు. ఒకే షేప్‌లో ఉంటుందనుకొంటారు. అయితే అలా చేయడం మంచి పద్దతి కాదు. దాని వల్ల ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది.