Ethanol Factory: తూర్పుగోదావరి..పవన్ కళ్యాణ్ నే ఇక మాకు దిక్కు అంటున్న నాలుగు గ్రామాలు ప్రజలు గుమ్మల్ల దొడ్డి అసాగో ఇండస్ట్రీ బాధితుల నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది.దీక్ష చేపడుతున్న వారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన.మా సమస్య తీరాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే జరుగుతుంది అంటున్న గ్రామస్తులు..పవన్ కళ్యాణ్ మాకు హామీ ఇస్తే దీక్ష విరమిస్తాము అంటున్న శివ గణేష్, పాఠం శెట్టి సూర్యచంద్ర. నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు బందు ప్రకటించడంతో, స్కూల్స్ అలానే దుకాణాలు మొత్తం స్వచ్ఛందంగా ఇబ్బంది చేసిన గ్రామస్తులు వాయుకాలుష్యం,శబ్దకాలుష్యం, నీటి కాలుష్యం పరిష్కరించే వరకు బాధితుల పక్షాన పోరాడుతూనే ఉంటాం అని శ్రీదేవిసూర్యచంద్ర,శివగణేశ్ అన్నారు.
Ethanol Factory: జగ్గంపేట నియోజకవర్గం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో జనావాసాలని ఆనుకుని నాలుగు గ్రామాల మధ్యలో నిర్వహిస్తున్న అస్సాగో ఇథనాల్ పరిశ్రమ నుండి వెలువడుతున్న వాయు,శబ్ద, జలకాలుష్యాలను నివారించాలని బాధితుల పక్షాన గత నాలుగు రోజుల నుండి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న పాటంశెట్టి శ్రీదేవీ సూర్యచంద్ర మరియు మరోతి శివగణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు పర్యావరణ శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపించాలని కోరారు. పరిశ్రమ నుండి వచ్చే కాలుష్యం వల్ల జరిగే నష్టాలను ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో పాటు,నిజ నిర్ధారణ కమిటీ వేసి సమస్య పరిష్కరించాలని అప్పటివరకు ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు