Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ సాధించిన ఈ చిత్రం రేపు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా ఫిక్స్ అయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం రన్‌టైమ్ యాడ్స్, టైటిల్స్ కలిపి 2 గంటల 40 నిమిషాలుగా నిర్ణయమైంది. దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది.
Also Read: Avatar 3: ఇండియాలో విడుదలకు ముందే అవతార్ 3 భారీ రికార్డ్?
రామ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్-మెర్విన్ డ్యూయట్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన బట్టి బ్లాక్‌బస్టర్ విజయం ఖాయమని అభిమానులు జోష్ చూపిస్తున్నారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకొని రామ్ కి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.
