Encounter: మావోయిస్టు పార్టీ సెక్రటరీ ఎన్ కౌంటర్

Encounter: తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయనతో పాటు మరో 17 మంది మరణించినట్లు మావోయిస్టు పార్టీ ఒక లేఖ ద్వారా ధృవీకరించింది. దామోదర్ స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామం.

దాదాపు 30 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దామోదర్, పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉండేవారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆయనపై రూ.50 లక్షల రివార్డు ఉండగా, తెలంగాణలో రూ.25 లక్షల రివార్డు ఉంది. ఆరు నెలల క్రితమే ఆయన మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాక, మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించారు.

ఈ సంఘటన మావోయిస్టు ఉద్యమంపై అలాగే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితులపై మరింత ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nimmala ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *