Kuberaa: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్న నిర్మాతలు, ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సంస్థ వేఫారర్ ఫిలింస్ సొంతం చేసుకోవడం విశేషం. దీంతో కేరళలో ‘కుబేర’కు మరింత హైప్ రానుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషనల్ డ్రామా, శక్తివంతమైన నటనతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని టాక్. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
