Dulquer Salmaan: సినీ ప్రియులకు గుడ్ న్యూస్! దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ “ఆకాశంలో ఒక తార” ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధమవుతోంది. సీతారామం, లక్కీ భాస్కర్‌లతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న దుల్కర్, ఈసారి మళ్ళీ ప్రేమికుడి పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన NRI తెలుగు నటి సత్విక వీరవల్లి హీరోయిన్‌గా కనిపించనుంది. కథ హీరోయిన్ చుట్టూ తిరిగేలా రూపొందించినట్టు సమాచారం.
దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా మిక్స్ చేశారని టాక్. రచయిత గున్నం గంగరాజు స్క్రిప్ట్‌కు జీవం పోశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. లైట్‌బాక్స్ మీడియా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా దుల్కర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.