Droupadi Murmu:రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే తొలి స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో వారు స్వాగతం పలికారు. వారితోపాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
Droupadi Murmu:తొలుత గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసుల నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు బయలుదేరి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ (ఎయిమ్స్)లో జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆమెతోపాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా పాల్గొననున్నారు.

