Papaya Leaf Juice: బొప్పాయి ఆకుల ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు. బొప్పాయి ఆకుల రసం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . అంతేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. క్యాంకర్ పుండ్లను నివారిస్తుంది. వారానికి 3 రోజులు బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు, ఖనిజాలు మరియు శక్తివంతమైన ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి ఆకుల రసంలో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే జీర్ణ ఎంజైమ్ అయిన పపైన్ నిండి ఉంటుంది. అంతేకాకుండా ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి ఆకు రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ప్రయోజనాలన్నీ వారానికి 3 సార్లు మాత్రమే బొప్పాయి ఆకు రసం తీసుకోవడం ద్వారా పొందవచ్చు.
Also Read: Curd Benefits For Skin: ముఖానికి పెరుగు వాడితే.. ఎన్ని లాభాలో తెలుసా ?
బొప్పాయి ఆకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగులకు మంచిది. తక్కువ GI కారణంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తుంది. బొప్పాయి ఆకు రసంలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే, విటమిన్ సి అధికంగా ఉండే బొప్పాయి ఆకుల రసాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. వారానికి మూడు రోజులు మాత్రమే బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి.