Donald Trump:

Donald Trump: భార‌త్‌కు త్వ‌ర‌లో ట్రంప్ ఇద్ద‌రు కుమారులు

Donald Trump:అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంపు ఇద్ద‌రు కుమారులు ఎరిక్ ట్రంప్‌, డొనాల్డ్ ట్రంప్ జూనియ‌ర్‌ త్వ‌ర‌లో భార‌త్‌కు రానున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఇండియాలో నిర్మిస్తున్న ఐకానిక్ ట్రంప్ ట‌వ‌ర్స్ ప్రాజెక్టుల‌ను వారు ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ముంబై, హైద‌రాబాద్‌, గురుగ్రామ్‌, బెంగ‌ళూరు, నోయిడా ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాజెక్టుల‌ను ప్రారంభించేందుకే వారు ఇక్క‌డికి వ‌స్తార‌ని స‌మాచారం. ఈ ట‌వ‌ర్స్ ప్రారంభ‌మైతే అమెరికా వెలుప‌ల ఎక్కువ‌గా ట‌వ‌ర్స్ ఉన్న దేశాల్లో భార‌త్ టాప్ ఉండ‌నున్న‌ది.

Donald Trump:ఆయా న‌గ‌రాల్లో 6 కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ట్రంప్ ట‌వ‌ర్లు 3 మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో 800 ల‌గ్జ‌రీ నివాసాల‌తో రూ.6 కోట్ల నుంచి 25 కోట్ల మ‌ధ్య ధ‌ర‌ను క‌లిగి ఉన్నాయ‌ని విశ్లేష‌కులు తెలిపారు. మొత్తం అమ్మ‌క‌పు విలువ రూ.15,000 కోట్ల ఉంటుంద‌ని అంచ‌నా. 2017లో డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడిగా ఉండ‌టానికి ముందు లోధా, పంచ్ల్ అండ్ ట్రిబెకా డెవెల‌ప‌ర్స్ వంటి డెవ‌ల‌ప‌ర్స్‌తో ఒప్పందాల ద్వారా ముంబై, పుణె, గుర్‌గావ్‌, కోల్‌క‌తాలో 4 ట్రంప్ ట‌వ‌ర్లు పూర్త‌య్యాయి.

Donald Trump:ఆయా ప్రాజెక్టుల్లో గోల్ప్ కోర్స్‌, విల్లాలు కూడా ఉంటాయి. 2025 నాటికి భార‌త్ జపాన్‌ను అధిగ‌మించి ప్ర‌పంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌బోతున్న‌ది. ఈ క్ర‌మంలో భార‌త్‌లో ట్రంపు కుటుంబం పెట్టుబ‌డులు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *