Donald Trump: గడిచిన కొంత కాలంగా తాను తీసుకుంటున్న నిర్ణయాల వాళ్ళ ట్రంప్ వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ఇపుడు మళ్లీ అమెరికా అధ్యక్షుడు వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం న్యూయార్క్ టైమ్స్‌పై వేసిన భారీ పరువు నష్టం దావా వేశాడు. ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో “$15 బిలియన్ పరువు నష్టం కేసు న్యూయార్క్ టైమ్స్‌పై దాఖలు చేశాను” అని ప్రకటించారు.
న్యూయార్క్ టైమ్స్‌పై ఆరోపణలు
ట్రంప్ మాటల్లో, టైమ్స్ చాలా కాలంగా డెమోక్రాట్లకు “మౌత్‌పీస్”లా పనిచేస్తూ, తనకు, తన కుటుంబానికి, తన వ్యాపారానికి, ఇంకా అమెరికా ఫస్ట్ ఉద్యమానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
అలాగే, 2024 ఎన్నికల్లో కమలా హారిస్‌కు ఇచ్చిన మద్దతు “చట్టవిరుద్ధ ప్రచార సహకారం”లో భాగమని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: India-US Trade War: ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత.. ఢిల్లీకి అమెరికా ప్రతినిధుల బృందం
గతంలోనూ మీడియా సంస్థలపై కేసులు
ఇది ట్రంప్‌కి కొత్త విషయం కాదు. గతంలో ABC, CBS, డిస్నీ వంటి మీడియా దిగ్గజాలపై ఆయన వేసిన పరువు నష్టం కేసులు వార్తల్లో నిలిచాయి.
-
ABC న్యూస్: యాంకర్ జార్జ్ స్టెఫానోపౌలోస్ వ్యాఖ్యలపై కేసు వేయగా, ఆ సంస్థ $15 మిలియన్లు చెల్లించి పరిష్కరించుకుంది.
-
CBS (పారామౌంట్ గ్లోబల్): 60 Minutesలో హారిస్ ఇంటర్వ్యూ వివాదం తర్వాత $16 మిలియన్లు చెల్లించింది.
ఇరు పరిష్కారాలు కూడా నేరుగా ట్రంప్‌కి కాకుండా ఆయన ప్రణాళికలో ఉన్న లైబ్రరీ ప్రాజెక్ట్‌కి వెళ్లాయి.
పాత కేసుల చరిత్ర
-
2021: ట్రంప్ ఆర్థిక వ్యవహారాలపై పులిట్జర్ గెలుచుకున్న సిరీస్ విషయంలో న్యూయార్క్ టైమ్స్‌పై $100 మిలియన్ల కేసు వేశారు. అయితే 2023లో న్యాయమూర్తి ఆ దావాను కొట్టివేశారు.
-
2023: CNN తనను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చిందని ఆరోపిస్తూ $475 మిలియన్ల దావా వేసినా, ఫెడరల్ కోర్టు తిరస్కరించింది.
ప్రస్తుత దావా ప్రత్యేకత
ఈసారి కేసు రిపబ్లికన్లకు బలమైన కోట అయిన ఫ్లోరిడాలో దాఖలైంది. ట్రంప్ మాటల్లో – “న్యూయార్క్ టైమ్స్ ఇక అబద్ధాల వేదిక కాదు. ఇది ఆగాల్సిందే!” అని స్పష్టం చేశారు.