Arvind Panagariya: ఉచితాలు కావాలో, మెరుగైన రోడ్లు కావాలో, మెరుగైన తాగునీటి సౌకర్యాలు, నాణ్యమైన భూగర్భ మురుగునీటి పారుదల పథకాలు కావాలో పౌరులే ఎంచుకోవాలని ఆర్థికవేత్త, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా అన్నారు.
గోవా రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఫైనాన్స్ కమిటీ సమావేశమైంది. అనంతరం అరవింద్ పనగారియా విలేకరులతో ముచ్చటించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను ఉచిత ప్రాజెక్టుల కోసం ఉపయోగించడాన్ని విలేకరులు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: L&T Chairman: మీ భార్య వైపే ఎంతసేపు అని చూస్తారు.? రండి ఆదివారం కూడా వచ్చి పని చేయండి
Arvind Panagariya: ఒక ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే ఆ నిధులను ఆ పనికే వినియోగించాలి. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక సంఘం ఆ నిర్ణయం తీసుకోదు. ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ప్రశ్న లేవనెత్తవచ్చు. సాధారణంగా ఏమీ చెప్పలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి ఖర్చు చేయాలనే నిర్ణయాన్ని నియంత్రించలేవు. ఉచితాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించవచ్చు. అయితే మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన రోడ్లు, మెరుగైన మురుగునీటి పారుదల సౌకర్యాలు కావాలా లేదా మీ బ్యాంకు ఖాతాలోకి ఉచితాలు చేరాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అరవింద్ పనగారియా!