vikram sugumaran

Vikram Sugumaran: ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ మృతి

Vikram Sugumaran: మధాయనై కూట్టం, రావణ కొట్టం చిత్రాల దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. మధురైలో ఒక నిర్మాతకు కథ చెప్పిన తర్వాత, రాత్రి బస్సు ఎక్కుతుండగా ఛాతీ నొప్పి వచ్చింది. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు కాపాడలేకపోయారని సమాచారం. సుకుమారన్ కు భార్య, పిల్లలున్నారు. చెన్నైలోని రెడ్ హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని చెన్నైకి తీసుకువచ్చారు. సుకుమారన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. త్వరగా వెళ్లిపోయావ్ మిత్రమా.. నీ నుంచి నేను ఎంతో నేేర్చుకున్నాను.. నీతో గడిపిన ప్రతీ క్షణాన్ని ఈ జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటాను.. మా అందరినీ వదిలి త్వరగా వెళ్లిపోయావ్ మిత్రమా.. నిన్ను ఇకపై ఎంతో మిస్ అవుతుంటాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ శంతను ట్వీట్ వేశారు. కాగా రామనాథపురం జిల్లాలోని పరమకుడికి చెందిన విక్రమ్ సుకుమారన్, బాలు మహేంద్ర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన బాలు మహేంద్రతో కలిసి 1999 నుండి 2000 వరకు విడుదలైన 56 లఘు చిత్రాలకు, అలాగే ‘జూలీ గణపతి’ చిత్రానికి పనిచేశారు. ఆయన ‘పొల్లాతవన్’, ‘కొడివీరన్’ చిత్రాల్లో కూడా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *