The Paradise

The Paradise: నాన్‌స్టాప్‌గా నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్

The Paradise: నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యింది. నాన్‌స్టాప్‌గా కొనసాగనుంది. మార్చి నాటికి పూర్తి చేయాలని ప్లాన్ వేసుకున్నారు. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే సెట్స్ నిర్మాణం, దర్శకుడి డీటెయిల్డ్ ప్లానింగ్ వల్ల కొంత ఆలస్యం జరిగింది. మళ్లీ షూటింగ్ స్పీడ్ పెంచనున్నారు.

Also Read: Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్‌కు బ్రేక్?

వృథా అయిన సమయాన్ని భర్తీ చేసుకునేందుకు నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ నాన్‌స్టాప్ షూటింగ్‌కు సిద్ధమయ్యారు. డిసెంబర్ మొత్తం హైదరాబాద్‌లోనే నాని ఈ సినిమాకు అందుబాటులో ఉంటారు. మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఆలస్యం కారణంగా రిలీజ్ మే లేదా జూన్‌కు వాయిదా పడే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మోహన్ బాబు, రాఘవ్ జుయాల్ విలన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *