Pahalgam Terror Atttack

Pahalgam Terror Atttack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న సెలబ్రిటీ జోడీ!

Pahalgam Terror Atttack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడి బయటపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. అయితే, ఈ దాడి నుంచి ప్రముఖ సెలబ్రిటీ జోడీ దీపికా కాకర్, షోయబ్ ఇబ్రహీం తృటిలో తప్పించుకున్నారు.దీపికా, షోయబ్ ఇటీవల కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. అక్కడి సుందర దృశ్యాలను వీడియో తీసి సన్నిహితులతో పంచుకున్నారు. అయితే, ఈ ఉగ్రదాడి వార్త వినగానే వారి ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో, దీపికా తాము కశ్మీర్ నుంచి సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నట్లు సన్నిహితులకు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kranthi Madhav: ప్రేమను 360 డిగ్రీస్ లో చూపించే ‘డి.జి.ఎల్.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *