Kubera

Kubera: ‘కుబేర’ సక్సెస్‌తో ధనుష్ హ్యాట్రిక్‌కు సిద్ధం?

Kubera: ‘కుబేర’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ధనుష్ నటనకు ప్రేక్షకుల నుంచి జోరుగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో ధనుష్ ఆనందంలో మునిగిపోయాడు. తెలుగులో ఆయనకు ఇది రెండో విజయం కావడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు ధనుష్ తదుపరి తెలుగు సినిమాపై అందరి దృష్టి పడింది.

Also Read: Ss Rajamouli: జపాన్ వీడియో గేమ్‌లో ఎస్.ఎస్. రాజమౌళి.. వీడియో వైర‌ల్

Kubera: సమాచారం ప్రకారం, ధనుష్ తన తొలి తెలుగు చిత్రం ‘సార్’ దర్శకుడు వెంకీ అట్లూరితో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. 2027లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ‘సార్’తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వెంకీతో ధనుష్ మళ్లీ జతకట్టడంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కుబేర’ విజయంతో ఉత్సాహంగా ఉన్న ధనుష్, టాలీవుడ్‌లో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *