Nayanthara

Nayanthara: ఆ ఫొటోలకు రూ.10 కోట్లు ఇవ్వాలా?.. ధనుష్ పై నయతార ఫైర్

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ పై ఫైర్ అయింది. తన బర్త్ డే రోజున రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్.. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ సందర్భంగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. నానుమ్ రౌడీ దాన్ అనే మూవీతో నయన్, డైరెక్టర్ విఘ్నేష్ ప్రేమలో పడింది. అయితే ఈ మూవీకి హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. అతని పర్మి షన్ లేకుండా సినిమా విజువల్స్ వాడారని తనకు పది కోట్ల రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. దీంతో ధనుష్ పై నయన్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు ఆయనకు బహిరంగ లేఖ రాసింది. ‘నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాకుండా సినీప్రియులు అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: KA: రూ. 50 కోట్ల గ్రాస్ సాధించిన ‘క’

Nayanthara: మా జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుమ్ రౌడీ దాస్ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. డాక్యుమెం టరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు పంపిన లీగల్ నోటీస్ నన్ను షాక్ కు గురిచేసింది. ఇక్కడే మీ కార్యెక్టర్ ఏమిటనేది తెలిసిపోతోంది’ అంటూ విమర్శలు చేసింది. కాగా హీరో ధనుష్ ను విమర్శిస్తూ నయనతార చేసిన ఇన్ స్టా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో కొందరు ఆమెకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రియా, అంజు కురియన్, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా, గౌరి జీ కిషన్ ఆమె పోస్ట్ ను లైక్ చేశారు. నటి పార్వతి ఆ పోస్ట్ ను తన ఇన్ స్టా స్టోరీగా అప్లోడ్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *