Devara Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా దేవర.గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయం సాధించింది. రికార్డు కలెక్షన్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూల్ రాబట్టిన చిత్రంగా దేవర నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 8 నుంచి దేవర సినిమా అందుబాటులో రానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి, వెండితెరపై రికార్డు విజయం సాధించిన ఈ మూవీ ఓటీటీఓ ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై కనిపించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్లు కీలకపాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ఇతి వృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దేవరగా ఎన్టీఆర్, భైరవగా సైఫ్ అలీఖాన్ నటించారు.
Devara Movie: ఇద్దరి మధ్య జరిగిన పోరాటమే ఈ సినిమా. వీళ్లిద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ ఏం చేశాడు.. దేవర ఎందుకు వద్దన్నాడు..? ఇవన్నీ సినిమాలో చూడాల్సిందే. కాగా, ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతోపటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
