Telangana: రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేన్నట్లుగా కేవలం 9 రోజుల్లోనే.. 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసాను ప్రజా ప్రభుత్వం రైతులకు అందించింది అని చెప్పారు. అందులో మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంట్, సబ్సిడీ గ్యాస్ సిలండర్, పేదలకు సన్నబియ్యం వంటి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
వీటితో పాటుగా ఎవరూ ఊహిచనంత పెద్ద స్థాయిలో రైతు భరోసాను ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అమలు చేస్తోందని చెప్పారు. అందులో భాగంగా ఈ సీజన్ మొదలు కాగానే ఎకరాకు గతంలో రూ. 10 వేలుంటే.. మనం రెండువేలు జోడించి.. రూ. 12 వేలు ఇవ్వడం జరిగింది. కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతోంది. గతంలో 5.. 10 ఎకరాలకు మాత్రమే అని పరిమితులు ఉండేదన్నారు. మన ప్రభుత్వంలో అవేమీ లేకుండా వ్యవసాయం యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతోంది. రైతు భరోసా వేయడం మొదలు పెట్టి కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. ఇంత తక్కువ కాలంలో రైతు భరోసాను పూర్తిగా వేయడం రాష్ట్ర చరిత్రలోనే ఇద తొలిసారని అన్నారు.
ఈ నెల 16న మొదలు పెట్టి 24 తారుఖున పూర్తి చేయడం జరుగుతోంది. అదే రోజున రాష్ట్రంలోని రైతు వేదికల వద్ద రైతులను సమావేశ పరుస్తాం. ప్రభుత్వం తరఫున సచివాలం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులంతా వారిని ఉద్దేశించి సందేశాన్న ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనను అనుసరించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేసింది కావున.. అన్ని మండల కేంద్రాల్లో మండల కమిటీల ఆధ్వర్యంలో కేవలం 9 రోజుల్లో కోటిన్నర ఎకరాలకు సుమారు 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను అందించిన విషయాన్ని వివరిచాలి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని కోరుతున్నా అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.