Delhi: అది దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని కళాశాల భవనం. వేసవిలో ఉక్కపోతను తగ్గించుకునేందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఓ ఐడియా వచ్చిందో.. ఎవరైనా చెప్పారో? స్వయంగా తెలుసుకున్నదో? ఏమో కానీ, ఆ ఐడియానే ఇక్కడ అమలు చేసింది. ఆ కళాశాల తరగతి గదుల లోపల వైపు ఆవు పేడతో పూసింది. వేసవి నుంచి రక్షణగా అమలు చేసింది.
Delhi: ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీభాయి కాలేజీలోని తరగతి గదుల్లో చల్లదనం కోసం ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష వత్సల ఈ చర్యలు తీసుకున్నారు. ఆమె స్వయంగా ఆవు పేడను గోడలకు పూస్తూ, సిబ్బందితో పూయిస్తూ స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఈ చర్యలకు కొందరు విద్యార్థులు విస్తుపోగా, మరికొందరు నిజమేనేమోనని నమ్మి ఊరుకున్నారు.
Delhi: వాస్తవంగా మట్టి గోడలకు ఆవు పేడను పూయడం భారత సమాజంలో ఆనవాయితీగా వస్తున్నది. అయితే సిమెంట్ గోడలకు కొత్త కొత్త రకాల కూలింగ్ కలర్లు మార్కెట్‌లో ఎన్నో అందుబాటుకి వచ్చాయి. సున్న రూపంలో కూడా చల్లదనం కోసం వాడే రంగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఆధునిక కాలంలో ఆవుపేడ పూయించడంపై కొందరు ఆమె చాదస్తంగా భావించారు. ఏదేమైనా ఆవుపేడ వల్ల కొంత సైంటిఫిక్ లాభం లేకపోలేదని మాత్రం ఆమె చెప్తున్నారు.

