CJP Protest: ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ముంబై (అక్టోబర్ 2), బెంగళూరుల్లో జరిగిన ఆందోళనల తర్వాత రాజధానిలో ఈ మహా ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నిరసనకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు.. రాజధానిని అష్టదిగ్బంధనం చేసేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
46,000 మందితో భారీ భద్రతా వలయం..
రవాణా పర్యవేక్షణ: ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, ట్రావెల్స్ బుకింగ్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. జూలై నాటి నిరసనకు వాహనాలు సమకూర్చిన ట్రావెల్ ఏజెన్సీలను ట్రేస్ చేస్తున్నారు.
రైల్వే స్టేషన్లు, మెట్రోలపై ఆంక్షలు: న్యూఢిల్లీ పరిధిలోని రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్ల వద్ద సీసీటీవీల ద్వారా తనిఖీలు చేపట్టారు. అవసరమైతే సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయడం, మార్కెట్లను బంద్ చేయాలని యోచిస్తున్నారు.
ఫేషియల్ రికగ్నిషన్‌తో 2,800 మందిపై ట్రాకింగ్..
-
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా నేర చరిత్ర ఉన్నట్లుగా గుర్తించిన 2,800 మంది వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
-
గతంలో గుర్తించిన వారిలో హత్య కేసులు, తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నవారు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరెవరైనా న్యూఢిల్లీ పరిధిలోకి ప్రవేశిస్తే తక్షణమే అదుపులోకి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
-
నగరంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీ యాజమాన్యాలతో పాటు విద్యార్థులుండే పీజీ (PG) హాస్టల్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తూ.. విద్యార్థులు ఈ నిరసనకు వెళ్లకుండా చూడాలని కోరారు.
సెక్షన్ 163 అమలు – స్టేడియాలు తాత్కాలిక జైళ్లుగా?..
-
సెక్షన్ 163 కింద నిషేధం:జంతర్ మంతర్‌తో పాటు ఢిల్లీలో ఎక్కడా అనుమతి లేని నిరసనలకు తావులేదని డీసీపీ సృష్టి పాండే స్పష్టం చేశారు. అనుమతి లేని సభల్లో పాల్గొంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
తాత్కాలిక జైళ్లు:భారీ సంఖ్యలో ఆందోళనకారులు వచ్చి స్వచ్ఛంద అరెస్టులకు దిగితే, వారిని తరలించేందుకు నగరంలోని స్టేడియాలను తాత్కాలిక డిటెన్షన్ కేంద్రాలుగా (Temporary Jails) మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
-
ఏఐ డీప్‌ఫేక్స్, సోషల్ మీడియాపై హెచ్చరిక:నిరసనల ముసుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటోలు, వీడియోలను ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులను లక్ష్యంగా చేసుకుని చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
