Telangana

Delhi: పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ కీలక నిర్ణయం

Delhi: పోలవరం – నల్లమల సాగర్ జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌ను ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంది. ఈ చర్య ద్వారా కేసు తీరు మారినట్లైంది.

రాజకీయ, చట్టపర మరియు పరిపలన పరమైన పరిమితులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త దిశగా అడుగుపెట్టింది. రిట్ పిటిషన్‌కు బదులు సివిల్ సూట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. సివిల్ సూట్ దాఖలు చేస్తే కేసును మరింత విస్తృతంగా వివరించే అవకాశం లభిస్తుంది. నీటి హక్కులు, పంపిణీ విధానం, ప్రాజెక్టుల ప్రభావం వంటి అంశాలను స్పష్టంగా వాదించేందుకు అవకాశం ఉంటుంది.

ఇక వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు కూడా సానుకూల స్పందన ఇచ్చింది. కోర్టు ప్రత్యామ్నాయ మార్గాల్లో సమస్యను పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అంటే చర్చలు, కేంద్ర మద్యవర్తిత్వం లేదా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా కూడా సమస్యను తీర్చుకునే మార్గాలు అందుబాటులో ఉంటాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *