Delhi Assembly Elections:ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. 2013 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీ రాష్ట్రాన్ని అప్రతిహాతంగా ఏలిన ఆ పార్టీ నేడు అథఃపాతాళానికి పడిపోయింది. ఇండియా పేరిట కూటమి కట్టినా అదే కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేసి రెండు పార్టీలు పరాజయాన్ని చవిచూశాయి. ఈ దశలో కాంగ్రెస్ పూర్ ఫర్మామెన్స్‌తో తన ఉనికినే కోల్పోయింది. ఇంతటి అవమానకర రీతిలో ఆ పార్టీ నిల్వడాన్ని హెచ్చరికగా భావించి మున్ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Delhi Assembly Elections:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీకు గాను ఈ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలతో అధికారాన్ని పదిలం చేసుకున్నది. ఆప్ ఉన్న అధికారాన్ని కోల్పోయి 22 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఈ దశలో కాంగ్రెస్ ఒకటి మినహా మిగతా అన్ని స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమై ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకున్నది. బీజేపీకి పడిన ఓటింగ్ శాతాని కంటే ఆప్-కాంగ్రెస్ పార్టీలకు పడిన ఓటింగ్ శాతం కలిపితే ఎక్కువగా ఉన్నది. అంటే కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని విశ్లేషకుల అంచనా.
Delhi Assembly Elections:ఫలితాల అనంతరం అభ్యర్థులకు సెక్యూరిటీ డిపాజిట్లను చెల్లించే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వెల్లడైన విషయాల్లోనే కాంగ్రెస పూర్ ఫర్మామెన్స్ బయటపడింది. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, అందులో 555 మంది అభ్యర్థులు తమ డిపాజిట్లు కోల్పోయారు. ఈ 555 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 67 మంది ఉండటం గమనార్హం. జాతీయ పార్టీ, పార్లమెంట్‌లో రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Delhi Assembly Elections:బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), ఎల్‌జేపీ (రామ్‌విలాస్ పాశ్వాన్) పార్టీల అభ్యర్థులందరూ తమ సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోవడం గమనార్హం. చివరికి రెండు స్థానాల్లో పోటీచేసిన ఏఐఎంఐఎంకు చెందిన షిఫా ఉర్ -రెహ్మాన్ ఓళ్లాలో తన సెక్యూరిటీ డిపాజిట్‌ను కాపాడుకోగలిగారు. మూడు పర్యాయాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి.. ఈ సారి 67 చోట్ల డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ నుంచి కస్తూర్భానగర్ నుంచి పోటీ చేసిన అభిషేక్ దత్ రెండోస్థానంలో నిలవగా, నంగోయ్ జాట్ నుంచి రోహిత్ చౌదరి, బద్దీ నుంచి దేవేందర యాదవ్ మాత్రమే తమ సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోగలిగారు.