Davos: వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగే ప్రపంచ స్థాయి సదస్సుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇదే సమావేశానికి మన దేశంలోని మరో రాష్ట్రమైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరవనున్నారు. మన దేశం నుంచి ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. వందకు పైగా దేశాల నుంచి వ్యాపార, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.
Davos: జనవరి 20 నుంచి దావోస్ 54వ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తెలంగాణ, ఏపీలో ఉన్న వనరులు, పెట్టుబడులకు అవకాశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు వివరించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన గురించి, వాటి విస్తరణపైనా చర్చించే అవకాశం ఉన్నది. ఏపీ సీఎం చంద్రబాబుతో సహా ఆ రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా ఈ సదస్సుకు వెళ్లనున్నారు.